కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సెలబ్రిటీలు, క్రీడాకారులు, అథ్లెట్లు పలు రకాలుగా సాయం చేస్తున్నారు. కొందరు డబ్బులను విరాళమిస్తుండగా, యూకే బాక్సర్ ఆమిర్‌ఖాన్ ఏకంగా తన నాలుగు అంతస్తుల భవంతి ఇవ్వాలని నిర్ణయించాడు. అందులో వైద్యం అందించేందుకు అనువుగా ఉంటుందని చెబుతూ ట్వీట్ చేశాడు.
"వైరస్ వ్యాపిస్తున్న ఈ సమయంలో ఆసుపత్రిల్లో మంచం దొరకడం కష్టమైపోతుంది. 60 వేల చదరపు అడుగులు ఉన్న నాలుగు అంతస్తుల నా భవంతిని, నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్)కు ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇందులో పెళ్లి మండపం, రిటైల్ ఔట్లెట్ ఉన్నాయి" -ట్విట్టర్లో బాక్సర్ ఆమిర్ ఖాన్