ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ (51కేజీ) బక్సమ్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆమె ఇటలీకి చెందిన సొరెన్టినోపై విజయం సాధించింది. 37 ఏళ్ల మేరీ చివరి మూడు నిమిషాల్లో ప్రత్యర్థిపై దాడిని పెంచింది. ఏడాది కాలంలో మేరీకి ఇదే తొలి బౌట్.
బక్సమ్ టోర్నీ: మేరీకోమ్ మరింత ముందుకు - మహ్మద్ హుసాముద్దీన్
బక్సమ్ అంతర్జాతీయ టోర్నీలో బాక్సింగ్ స్టార్ మేరీకోమ్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. పురుషుల విభాగంలో తెలుగు కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాడు.
బక్సమ్ టోర్నీ: మేరీకోమ్ మరింత ముందుకు
పురుషుల విభాగంలో తెలంగాణ కుర్రాడు మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 57 కేజీల తొలి రౌండ్లో హుసాముద్దీన్ 4-1తో జువాన్ టోరెస్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. 63 కేజీల బౌట్‌లో మనీష్ కౌశిక్ 5-0తో ఎమారి రాడోన్స్ (స్పెయిన్)ను చిత్తుచేసి క్వార్టర్స్ చేరుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మనీష్ ఏడాది విరామం తర్వాత బరిలో దిగాడు.
ఇదీ చూడండి:స్విస్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
Last Updated : Mar 4, 2021, 10:06 AM IST