తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్పెయిన్​ బయలుదేరిన భారత బాక్సర్ల బృందం

కాస్టెల్లన్ వేదికగా మార్చి 1 నుంచి జరగనున్న అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనడానికి 14 మందితో కూడిన భారత బృందం స్పెయిన్ బయలుదేరి వెళ్లింది. ఈ బృందానికి మేరీ కోమ్ నాయకత్వం వహించనుంది.

Boxam International Boxing Tournament: 14-member Indian team leave for Spain
స్పెయిన్​ బయలుదేరిన భారత బాక్సర్ల బృందం

By

Published : Feb 28, 2021, 9:30 PM IST

స్పెయిన్​ కాస్టెల్లన్ వేదికగా జరగనున్న బోక్సమ్​ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పాల్గొనేందుకు 14 మందితో కూడిన భారత బృందం బయలుదేరి వెళ్లింది. మార్చి 1-7 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్​(51 కే.జీ.)తో పాటు కామన్వెల్త్​ గేమ్స్​ సిల్వర్​ పతక విజేత మనిష్​ కౌశిక్​(63 కే.జీ.)లు ఇండియా తరఫున కీలక బాక్సర్లు. వీరిద్దరూ గతేడాది మార్చిలో జోర్డాన్​లో జరిగిన ఆసియన్​ ఒలింపిక్​ క్వాలిఫయర్స్​ పోటీల తర్వాత తొలిసారి రింగ్​లోకి దిగబోతున్నారు.

యంగ్​ బాక్సర్​ జాస్మిన్​ తన తొలి సీనియర్​ పర్యటనలో పాల్గొనబోతోంది. ఆమె 57 కే.జీ.ల విభాగంలో ఆడనుంది. ఈ బృందంలో తొమ్మిది మంది.. ఒలింపిక్స్​కు​ అర్హత సాధించిన బాక్సర్లు ఉన్నారు. ఈ బృందానికి మేరీ కోమ్​ నాయకత్వం వహించనుంది.

ఇదీ చదవండి:ఆ యువకుడి ప్రతిభకు సచిన్​ ఫిదా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details