భారత బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్ ఇస్తాంబుల్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో పతకం ఖాయం చేసుకుంది. 2019 ప్రపంచ ఛాంపియన్ ఎకతెరీనా పత్సెవా (రష్యా)పై సంచలన విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇస్తాంబుల్ టోర్నీలో నిఖత్‌కు పతకం ఖాయం - నిఖత్ జరీన్ సెమీఫైనల్
భారత బాక్సర్, తెలుగమ్మాయి నిఖత్ జరీన్.. ఇస్తాంబుల్ బాస్పోరస్ బాక్సింగ్ టోర్నీలో పతకం ఖాయం చేసుకుంది. నేడు (గురువారం) సెమీఫైనల్ పోరులో తలపడనుంది.
నిఖత్
బుధవారం జరిగిన 51 కేజీల ఫ్లై వెయిట్ క్వార్టర్‌ఫైనల్లో నిఖత్ 5-0తో ఎకతెరీనాను చిత్తుచేసి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. గురువారం నిఖత్ సెమీస్‌లో తలపడుతుంది.