కరోనా కారణంగా అజర్‌బైజాన్‌లోని బాకులో జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ రద్దైంది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్లను మంచి సన్నాహకంగా భావించిన ఈ టోర్నీ జూన్ 21 నుంచి జులై 2 వరకు జరగాల్సి ఉంది.
కరోనా ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ రద్దు
అజర్‌బైజాన్‌లోని బాకు వేదికగా జరగాల్సిన షూటింగ్ ప్రపంచకప్ రద్దు అయ్యింది. తమ దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతోన్న కారణంగా టోర్నీని రద్దు చేయాలని భావించినట్లు ఆ దేశ షూటింగ్ సమాఖ్య(ఏఎస్ఎఫ్) వెల్లడించింది.
కరోనా ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ రద్దు
దేశంలో వైరస్ కేసులు పెరుగుతోన్న క్రమంలో షూటింగ్ ప్రపంచకప్‌ను నిర్వహించడం సురక్షితం కాదని అజర్బైజాన్ షూటింగ్ సమాఖ్యా(ఏఎస్ఎఫ్) నిర్ణయించింది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య(ఐఎస్ఎస్ఎఫ్)కు వెల్లడించింది.
ఇదీ చూడండి..ఆర్చరీ ప్రపంచకప్: స్వర్ణాలతో మెరిసిన దాస్, దీపిక