తెలంగాణ

telangana

ETV Bharat / sports

బరోడా ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్​ - baroda bypoll bjp

హరియాణాలోని బరోడా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికకు భాజపా తమ అభ్యర్థిని ప్రకటించింది. నవంబరు 3న జరిగే ఉప ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్​, ఒలంపిక్స్ పతక విజేత యోగేశ్వర్​ దత్​ను బరిలో దింపనున్నట్లు పార్టీ తెలిపింది.

BJP names Yogeshwar Dutt as party candidate for Baroda bypoll in Haryana
బరోడా ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా ప్రముఖ రెజ్లర్​

By

Published : Oct 16, 2020, 10:59 AM IST

ప్రముఖ రెజ్లర్​, ఒలంపిక్స్ పతక విజేత యోగేశ్వర్​ దత్​ను హరియాణా బరోడా అసెంబ్లీ ఉపఎన్నికకు భాజపా అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. అంతకుముందు కొందరు క్రీడాకారులు హరియాణా ముఖ్యమంత్రి ఎమ్.ఎల్​. ఖట్టర్​ని దిల్లీలో కలిశారు. వీరిలో బబితా ఫోగాట్, సాక్షి మాలిక్​, గీతా ఫోగాట్​ లతో పాటు యోగేశ్వర్​ దత్​ ఉన్నారు. ఆ తర్వాత యోగేశ్వర్​నుఖట్టర్​ అభ్యర్థిగా ప్రకటించారు.నవంబరు 3న బరోడా ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే శ్రీ కిషన్ హూడా ఏప్రిల్​లో మరణించగా.. ఖాళీ ఏర్పడింది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తుంది.

భాజపా ఖాతా తెరవలేదు :

బరోడాలో ఇప్పటివరకు భాజపా ఒక్కసారైనా గెలవలేదు. భాజపా అభ్యర్థిగా మొదట 25మంది పేర్లను పరిశీలించినట్లు ఖట్టర్​ తెలిపారు. అందులో నలుగురి పేర్లను ఎంపిక చేసి పార్టీ హైకమాండ్​కి పంపినట్లు వెల్లడించారు. వీరిలో దత్​ను పార్టీ అభ్యర్థిగా ఫైనల్​ చేసినట్లు వెల్లడించారు.

భైంస్​​వాల్​ ​ నుంచి బరోడాకు :

రెజ్లర్​ యోగేశ్వర్​ దత్​ స్వస్థలం సోనెపట్​ జిల్లాలోని భైంస్​​వాల్​ కలాన్​ గ్రామం. 2014 ఒలంపిక్స్​లో బంగారు పతకం సాధించారు . 2013లో ఆయనకు పద్మశ్రీ వచ్చింది. అతను 2019 ఎన్నికల సమయంలో భాజపాలో చేరారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నందువల్ల ప్రస్తుతం దత్​ ప్రచారంలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details