తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రన్​ టు ద మూన్'​ ఈవెంట్​లో 14 వేలమంది రన్నర్స్ - Hockey latest news

కోచ్​లు, సహాయక సిబ్బందిని ఆదుకునేందుకు నిర్వహించిన 'రన్​ టు ద మూన్'​ ఈవెంట్​కు విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 15 దేశాల నుంచి 14 వేల మంది అథ్లెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. నెల రోజుల పాటు సాగనున్న ఈ పరుగు.. వచ్చే నెల 21న పూర్తి కానుంది.

BIG RESPONCE FOR RUN TO THE MOON PROGRAM
'రన్​ టు ద మూన్'​కు గొప్ప స్పందన

By

Published : Jun 26, 2020, 7:11 AM IST

Updated : Jun 26, 2020, 7:16 AM IST

కరోనా వల్ల విధించిన లాక్​డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కోచ్​లు, సహాయక సిబ్బందిని ఆదుకోవడం కోసం నిర్వహిస్తున్న 'రన్​ టు ద మూన్​' కార్యక్రమానికి గొప్ప స్పందన లభిస్తోంది. 15 దేశాల నుంచి 14 వేల మంది రన్నర్లు ఈ పరుగులో పాల్గొంనేందుకు పేర్లు నమోదు చేసుకున్నారు. శనివారం మొదలైన ఈ పరుగు.. నెల రోజుల పాటు సాగనుంది. చంద్రుడిపై తొలిసారిగా మానవుడు ఆడుగుపెట్టి 51 ఏళ్లు అవుతున్న సందర్భంగా వచ్చే నెల 21న ఈ పరుగు పూర్తి కానుంది. ఈ నెల రోజుల్లో భూమి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3లక్షల 84,400 కిలోమీటర్లను రన్నర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

జాతీయ బ్యాడ్మింటన్​ ప్రధాన కోచ్​ కోపీచంద్​, దిగ్గజ స్ప్రింటర్​ అశ్నిని నాచప్ప, పారా అథ్లెట్​ మాలతి ఈ కార్యక్రమానికి మార్గనిర్దేశకులుగా వ్యవహరించనున్నారు. పేర్లు నమోదు చేసుకున్న రన్నర్లు.. వాళ్లకు అనుకూలమైన ప్రాంతాల్లో పరుగెత్తొచ్చు. వాళ్లు ప్రతిరోజు పరుగెత్తాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరూ నెల రోజుల్లో కనీసం 65 కిలోమీటర్లు దూరాన్ని పూర్తి చేయాలి.

ఇప్పటికే రన్నర్లు 95,514 కిలోమీటర్లు దూరాన్ని పూర్తి చేశారు. పేర్ల నమోదుకు తొలి 10 వేల మది రూ.100 చొప్పున విరాళంగా చెల్లించారు. అనంతరం పేర్లు నమోదు చేసుకున్న వాళ్లు ఆ మొత్తంతో పాటు రూ.250 చెల్లించారు. మొత్తం రూ.14 లక్షలకు పైగా పోగైన డబ్బును అవసరాల్లో ఉన్న కోచ్​లు, సహాయక సిబ్బందిని గుర్తించి ఆర్థిక సాయం అందజేస్తారు.

హాకీ సిబ్బంది కోసం రూ.22 లక్షలు

లాక్​డౌన్​ కారణంగా హాకీ రంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే ఇబ్బందుల్లో ఉన్న ఆటగాళ్లు, కోచ్​లు, గ్రౌండ్స్​మెన్​ను ఆదుకునేందుకు భారత హాకీ జట్టు కెప్టెన్​ విరెన్​ రస్కీనా రూ.22 లక్షల విరాళాలు సేకరించాడు. ఈ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న వాళ్లకు పంచనున్నారు. మాజీ హాకీ ఆటగాళ్లు, ఇతర క్రీడాకారుల సాయంతో ఒక వారంలోనే ఈ డబ్బును సేకరించారు. ఇబ్బందుల్లో ఉన్న 200 మందికి ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున అందించనున్నారు.

ఇదీ చూడండి:'శారీరక శ్రమతోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది'

Last Updated : Jun 26, 2020, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details