తెలంగాణ

telangana

ETV Bharat / sports

టోక్యో ఒలింపిక్స్​ నడక పోటీలకు ​'భావ్నా' అర్హత - ఒలింపిక్స్​ న్యూస్​

రాజస్థాన్​కు చెందిన భావ్నా జాట్​ అరుదైన ఘనత సాధించింది. 20 కిలోమీటర్ల నడక పోటీల్లో ఈమె ఒలింపిక్స్​ పోటీలకు అర్హత పొందింది. రాంచీ​ వేదికగా జరిగిన 7వ జాతీయ రేస్​వాక్​ ఛాంపియన్​షిప్​లో.. ఈ దూరాన్ని గంటన్నర కంటే తక్కువ సమయంలో చేరుకుంది.

Bhawna Jat breaks national record in 20 km race walk event, eligible to tokyo Olympics 2020
ఒలింపిక్స్​కు అర్హత సాధించిన మొదటి మహిళా రేస్​వాకర్​

By

Published : Feb 15, 2020, 2:22 PM IST

Updated : Mar 1, 2020, 10:20 AM IST

రాజస్థాన్​కు చెందిన అథ్లెట్​ భావ్నా జాట్ సరికొత్త రికార్డు సాధించింది. శనివారం రాంచీ వేదికగా జరిగిన 7వ జాతీయ రేస్​వాక్​ ఛాంపియన్​షిప్​లో పాల్గొన్న ఈ క్రీడాకారిణి... 20 కిలోమీటర్ల రేసు తక్కువ సమయంలో పూర్తిచేసింది. ఇందుకు ఒక గంట 29 నిమిషాల 54 సెకన్ల(1:29:54) సమయాన్ని మాత్రమే తీసుకుంది. ఫలితంగా సరాసరి ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. ఈ ఘనత అందుకున్న మొదటి భారతీయ మహిళగా పేరు తెచ్చుకుంది.

భారతీయ క్రీడాకారుల సమాఖ్య ప్రకారం.. 20 కిలోమీటర్ల దూరాన్ని ఒక గంట 31 నిమిషాలల్లో(1:31:00) పూర్తిచేయాలి. నిర్ణీత సమయం కంటే ముందుగా గమ్యం చేరుకోవడం వల్ల భావ్నా టోక్యో ఒలింపిక్స్​కు బెర్త్​ సంపాదించుకుంది.

9 నిమిషాల కంటే ముందుగా..

గతేడాది జరిగిన పోటీలో 20 కి.మీ.ల దూరాన్ని చేరటానికి ఒక గంట 38 నిమిషాల సమయం తీసుకుంది భావ్నా​. తాజాగా జరిగిన ఈవెంట్​లో 9 నిమిషాల కంటే ముందుగానే గమ్యాన్ని చేరింది. వచ్చే నెలలో ఆసియా రేస్​ వాకింగ్​ ఛాంపియన్​షిప్​లోనూ పాల్గొననుంది.

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన రెండో రేస్​ వాకర్​గా భావ్నా అర్హత సాధించింది. ఇప్పటికే పురుష రేస్​వాకర్​ కెటీ ఇర్ఫాన్​ ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. 2016లో జరిగిన ఒలింపిక్స్​లో పురుష రేస్​వాకర్​ మనీష్​ రావత్...​ నిమిషం వ్యవధిలో పతకాన్ని కోల్పోయాడు.

ఇదీ చూడండి.. ఆసియా ఛాంపియన్​షిప్​లో సెమీస్​ చేరిన భారత్​

Last Updated : Mar 1, 2020, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details