టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించింది తమిళనాడుకు చెందిన సీఏ భవానీ దేవీ. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ ద్వారా భవానీ అర్హత సాధించింది. ఇది చారిత్రక ఘట్టంగా అభివర్ణించింది భారత క్రీడా సమాఖ్య.
ఈ సందర్భంగా భవానీని అభినందించారు కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజుజు. "టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత ఫెన్సర్ భవానీ దేవీకి అభినందనలు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది." అని రిజుజు ట్వీట్ చేశారు.
8 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన భవానీ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.