ఆసియా ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్లో భారత పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శనివారం పురుషుల సెమీస్‌లో భారత్.. కజకిస్థాన్‌ను ఓడించింది. తొలి రౌండ్లో 3.5-1.5తో గెలిచిన మన బృందం.. రెండో రౌండ్లో 3-1తో నెగ్గి ముందంజ వేసింది.
ఆసియా చెస్ టోర్నమెంట్ ఫైనల్లో భారత జట్లు - చెస్ టోర్నమెంట్లో భారత్ హవా
ఆన్‌లైన్ వేదికగా జరిగిన ఆసియా చెస్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. పురుషులు, మహిళల జట్లు ఫైనల్‌కు చేరాయి.

ఆసియా ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు భారత్
మహిళల విభాగంలో భారత్.. మంగోలియాను చిత్తు చేసింది. తొలి రౌండ్లో 3.5-0.5తో నెగ్గిన అమ్మాయిలు.. రెండో రౌండ్లో 4-0తో విజయం సాధించారు.
ఇదీ చదవండి:సన్‌రైజర్స్‌పై పంజాబ్ విజయం