చైనా వేదికగా జరిగినషూటింగ్ ప్రపంచకప్ ఫైనల్స్‌లో భారత యువ షూటర్లు అదరగొట్టారు. అద్భుత ప్రదర్శన చేస్తూ గురువారం ఒక్కరోజే భారత ఖాతాలో మూడు స్వర్ణాలు చేర్చారు. ముఖ్యంగా 17 ఏళ్ల మను బాకర్ జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతూ పసిడి గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 244.7 పాయింట్లు సాధించిన బాకర్.. జియాంగ్ (243.3, చైనా) పేరిట ఉన్న రికార్డును తుడిచి పెట్టింది.
షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ పసిడి హ్యాట్రిక్ - shooting world cup
షూటింగ్ ప్రపంచకప్‌లో భారత యువ షూటర్లు సత్తా చాటారు. మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం, మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఎలవెనిల్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్(పురుషులు) షూటింగ్లో దివ్యాంశ్ పన్వర్ స్వర్ణాన్ని సాధించి భారత్‌కు పసిడి హ్యాట్రిక్ తెచ్చారు.
ప్రపంచకప్ వరల్డ్ షూటింగ్లో భారత్ పసిడి హ్యాట్రిక్
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 20 ఏళ్ల ఎలవెనిల్ పసిడి నెగ్గింది. క్వాలిఫయింగ్‌లో 631.1 పాయింట్లతో రెండో స్థానంతో ఫైనల్‌కు చేరుకుంది.తుది సమరంలో 250.8 పాయింట్లతో స్వర్ణం గెలుచుకుంది.
మరో టీనేజర్ దివ్యాంశ్ పన్వర్.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి పతకాన్ని పట్టాడు. ఫైనల్లో 250.1 పాయింట్లు సాధించిన ఈ 17 ఏళ్ల షూటర్.. హంగేరి, స్లొవేకియా షూటర్లను వెనక్కినెడుతూ స్వర్ణం గెలిచాడు.
Last Updated : Nov 22, 2019, 8:37 AM IST