తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఎగ్జామ్స్​ ఓవైపు.. షూటింగ్​ పోటీలు మరోవైపు - పెన్నుతో కుస్తీపడుతోన్న షూటర్

క్రొయేషియాలో షూటింగ్​ పోటీల్ని, పరీక్షల ప్రిపరేషన్​ను ఏకకాలంలో నిర్వర్తిస్తూ ఆహా అనిపిస్తోంది యువ షూటర్ మను బాకర్. తన పోటీల సమయంలోనూ, బీఏ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతోంది.

manu Bhaker
మను బాకర్

By

Published : May 16, 2021, 5:52 PM IST

Updated : May 16, 2021, 6:14 PM IST

ఒలింపిక్స్​ కోసం సిద్ధమవుతున్న భారత స్టార్ షూటర్ మను బాకర్.. ప్రస్తుతం యూరోపియన్ ఛాంపియన్​షిప్​ కోసం క్రొయేషియా వెళ్లింది. మరోవైపు తన బీఏ పరీక్షలు కోసం పుస్తకాలతో కుస్తీ పడుతోంది. తన హోటల్​ గదిలో ఖాళీ సమయంలో చదువుకుంటోంది.

మను బాకర్

దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరామ్ మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతోంది మను. మే 18 నుంచి అక్కడ పరీక్షలు జరగనున్నాయి. అయితే భారత బృందం అతిథిగా పాల్గొంటోన్న యురోపియన్ ఛాంపియన్​షిప్.. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో మే 20న ప్రారంభం కానుంది. ఈ టోర్నీతో పాటు ఈమె పరీక్షలు ఏకకాలంలో జరగనున్నాయి. అయితే పరీక్షలు, పోటీలు వేర్వేరు తేదీల్లో ఉండటం మనుకు కలిసివచ్చే అంశం.

"గతంలోలానే పరీక్షలు, షూటింగ్.. రెండింటినీ పూర్తిచేస్తాను. పరీక్ష ఉన్న రోజు పోటీలు లేవు కాబట్టి ఆ పని నేను చేయగలను. ఈ ఏడాది ఒలింపిక్స్​లో అత్యుత్తమ ప్రదర్శన చేసి, దేశం గర్వపడేలా చేయడంపై ప్రస్తుతం దృష్టి పెట్టాను"

- మను బాకర్, భారత షూటర్

టోక్యోలో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్​ జరగనున్నాయి. 19 ఏళ్ల మను బాకర్ ఇందులోని 3 ఈవెంట్లలో పాల్గొననుంది.

ఇదీ చూడండి:మహిళల 25మీ పిస్టల్​ విభాగంలో భారత్​కు స్వర్ణం

Last Updated : May 16, 2021, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details