తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రతిభ ఉన్నవాళ్లకు పరీక్షలు అవసరం లేదు' - ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షఇప్

ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​కు మేరీకోమ్​ను ఎంపికచేయడంపై అసహనం వ్యక్తం చేసింది మరో బాక్సర్ నిఖత్ జరీన్. అనంతరం ఈ విషయంపై ఘాటూగా సమాధానమిచ్చింది మేరీ. ప్రతిభ ఉన్నవాళ్లకు పరీక్షలు అవసరం లేదని చెప్పింది.

బాక్సర్ మేరీకోమ్

By

Published : Aug 22, 2019, 6:31 AM IST

Updated : Sep 27, 2019, 8:27 PM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్​ పోటీలు సెప్టెంబర్​-అక్టోబర్​లో రష్యాలో జరగనున్నాయి. భారత్​ తరఫున బాక్సింగ్​ పోటీలకు మేరీకోమ్​ను ఎంపిక చేయటంపై మరో బాక్సర్​ నిఖత్​ జరీన్​ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి పరీక్ష లేకుండా ఆమెను ఎలా ఎంపిక చేస్తారని ​బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బిఎఫ్‌ఐ)కు లేఖ రాసింది​.​ అవకాశమున్నా తనకు పోటీ చేసే అర్హత లేకుండా చేశారని ఆరోపించింది. స్పందించిన మేరీకోమ్​.. ఈ పోటీలకు తన ఎంపిక సరైనదేనని, ప్రతిభ ఉన్నవాళ్లకు పరీక్షలు అవసరం లేదని జవాబిచ్చింది.

"సెలక్టర్లు అన్ని విధాలా పరిశీలించే ఎంపిక చేస్తారు. సరైన ప్రదర్శన చూపితే ఎలాంటి ట్రయల్ అవసరం లేదు. వారు ఏ ఛాంపియన్‌షిప్​కైనా, టోర్నీకైనా అర్హులే. బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో ట్రయల్​ ఇవ్వటం ఎప్పుడైనా చూశారా? సైనా, సింధు ఎప్పడైనా ట్రయల్ ఇచ్చారా? అది ఇవ్వటం, ఇవ్వకపోవటం నా చేతిలో లేదు. ఆ విషయాన్ని బిఎఫ్​ఐ నిర్ణయిస్తుంది." -మేరీకోమ్​, బాక్సర్​

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన మేరీ.. ఒలింపిక్స్​లోనూ కాంస్య పతకాలు గెలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో గువహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో జరీన్‌ను ఓడించి కాంస్యం గెలిచింది మేరీ.

బాక్సర్​ మేరీకోమ్
ఈ విషయంపై తన ఎంపిక జరిగి ఉంటుందని, తాను బిఎఫ్​ఐపై ఎలాంటి ఒత్తిడి తేలేదని తెలిపింది. 51 కిలోల విభాగంలో పోటీ పడుతుందీ బాక్సర్​.

ఇది చదవండి: జాతీయ క్రీడా పురస్కారాల కోసం కమిటీ సిద్ధం

Last Updated : Sep 27, 2019, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details