తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఖేల్​రత్నకు భారత అగ్రశేణి బాక్సర్ల పేర్లు​

భారత అగ్రశేణి బాక్సర్లు అమిత్​ పంఘల్​, వికాస్​ కృష్ణన్​ పేర్లను ఖేల్​రత్నకు సిఫార్సు చేసింది భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్​ఐ). అర్జున అవార్డులకు లవ్లీనా, సిమ్రన్​జీత్​ కౌర్​, మనీష్​ కౌషిక్​ పేర్లతో కూడిన జాబితాను కేంద్రానికి పంపింది.

Amit Panghal, Vikas Krishan
అమిత్​ పంగాల్​, వికాస్​ కృష్ణన్​

By

Published : Jun 1, 2020, 9:22 PM IST

ప్రపంచ బాక్సింగ్‌ రజత పతక విజేత, టాప్‌సీడ్‌ అమిత్‌ పంఘల్, అగ్రశ్రేణి బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్​లకు అరుదైన గౌరవం దక్కే అవకాశం ఉంది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డు (2020)కు వీరి పేర్లను సిఫార్సు చేసింది భారత బాక్సింగ్​ సమాఖ్య.

అర్జున అవార్డులకు లవ్లీనా​ (69 కిలోలు), సిమ్రన్​జీత్​ కౌర్​(64 కిలోలు), మనీష్​ కౌషిక్​(63 కిలోలు)ల పేర్లను కేంద్రానికి పంపింది. వీరిలో లవ్లీనా..​ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్​షిప్​లో​ కాంస్య పతకాన్ని రెండు సార్లు గెలిచింది.

జాతీయ మహిళా బాక్సింగ్​ కోచ్​ మహ్మద్​ అలీ కమార్​, అసిస్టెంట్​ కోచ్​ ఛోటే లాల్​ యాదవ్​ పేర్లను ద్రోణాచార్య అవార్డుకు సిఫార్సు చేసింది. గత నాలుగేళ్ల ప్రదర్శన ఆధారంగా వీరి పేర్లను కేంద్రానికి పంపినట్లు బీఎఫ్​ఐ తెలిపింది. అలాగే ధ్యాన్​చంద్ పురస్కారం కోసం ఎన్​.ఉష్​ను నామినేట్ చేసింది.

ఇది చూడండి : క్రీడల్లో అత్యున్నత పురస్కారానికి రోహిత్​శర్మ నామినేట్​

ABOUT THE AUTHOR

...view details