తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత అథ్లెట్​ గోమతిపై నాలుగేళ్లు నిషేధం!

భారత అథ్లెట్​ గోమతి మారిముత్తుపై నాలుగేళ్లు నిషేధం పడనున్నట్లు సమాచారం. తాజాగా డోపింగ్‌లో శాంపిల్​-బి పాజిటివ్​గా తేలడమే కారణం.

gomati
గోమతి

By

Published : Jun 9, 2020, 9:07 AM IST

భారత అథ్లెట్‌ గోమతి మారిముత్తుపై నాలుగేళ్ల నిషేధం పడనున్నట్లు సమాచారం. నిషేధిత ఉత్ప్రేరకం వాడి డోపింగ్‌ పరీక్షలో పట్టుబడిన ఈ 800 మీటర్ల రన్నర్‌ నుంచి గతేడాది ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని కూడా వెనక్కి తీసుకోనున్నట్లు తెలిసింది. ఆమె రూ.1 లక్ష జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు.

డోపింగ్‌లో శాంపిల్‌-ఎ పాజిటివ్‌గా తేలడం వల్ల గోమతిపై గతేడాది మేలో తాత్కాలిక నిషేధం విధించారు. తాజాగా శాంపిల్‌-బిలో కూడా ఆమె పాజిటివ్‌ అని తేలింది. దీంతో 2023, మే 16 వరకు గోమతి పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయినట్లే.

ఇది చూడండి : ఆ అలవాటును తగ్గించే ప్రయత్నంలో కుల్దీప్

For All Latest Updates

TAGGED:

GOMATHI

ABOUT THE AUTHOR

...view details