భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా దాతృత్వం చాటుకున్నాడు. తన ఆరు నెలల జీతాన్ని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విరాళమిస్తున్నట్లు చెప్పాడు. వెంటనే ఇతడిపై ప్రశంసలు కురిపించారు కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు. ఈ ఏడాది జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు భజరంగ్.
"ఒలింపిక్స్ కంటే ముందు కరోనాపై మనం పోరాడాలి. ఒకవేళ పరిస్థితి అదుపులోకి రాకపోతే 2-3 నెలలు ఇలానే చేయాల్సి ఉంటుంది. చాలా దేశాలు తమ అథ్లెట్లను ఒలింపిక్స్‌కు పంపకపోవచ్చు. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా తప్పుకున్నాయి. దీనిని బట్టే చూస్తే మెగా క్రీడల్ని వాయిదా వేయడమే మంచిది" -భజరంగ్ పూనియా, భారత రెజ్లర్