తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమెరికాలో విజయాల వీరుడితో పునియా పోటీ

భారత స్టార్​ రెజ్లర్​ భజరంగ్​ పునియా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అమెరికా గడ్డపై కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్న తొలి భారతీయ రెజ్లర్​గా పేరు సంపాదించాడు.

విజయాల వీరుడితో పోటీకి భారతీయ రెజ్లర్​కు ఆహ్వానం​

By

Published : Apr 27, 2019, 7:38 PM IST

ఓ వైపు 47 మ్యాచ్​ల్లో ఓటమి ఎరుగని యోధుడు... మరోవైపు 9 ప్రపంచ స్థాయి టోర్నీల్లో 8 స్వర్ణాలు గెలిచిన భారతీయుడు. వీరిద్దరి మధ్య పోటీ. అందులోనూ అమెరికా నడిబొడ్డున ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయర్క్​ 'మాడిసన్​ స్క్వేర్​​ గార్డెన్' వేదిక.

అమెరికా రెజ్లింగ్​ అసోసియేషన్​ నుంచి భారత రెజ్లర్​ భజరంగ్​ పునియాకు ఆహ్వానం అందింది. దీంతో అమెరికా గడ్డపై కుస్తీకి దిగనున్న తొలి భారత క్రీడాకారుడిగా ఘనత సాధించాడు పునియా. ​రెండు సార్లు అమెరికా ఛాంపియన్​ 'ఇన్నీ డియాకోమిహలిస్​'తోమే 6న.. 65 కేజీల విభాగంలో పోటీకి సిద్ధమవుతున్నాడు భజరంగ్​.

మాడిసన్​ ​స్వేర్​ గార్డెన్ వేదికగా మే 6న తలపడనున్నఇన్నీ, భజరంగ్​

ఇద్దరూ ఇద్దరే...

ఇటీవల ఆసియా ఛాంపియన్​షిప్​లో స్వర్ణ కైవసం చేసుకున్నాడు భజరంగ్​. ఈ 25 ఏళ్ల యువ ఆటగాడు 9 ప్రపంచ స్థాయి టోర్నీల్లో పాల్గొని 8 బంగారు పతకాలు గెలిచాడు. 2018 కామన్వెల్త్​ క్రీడలు, 2018 ఆసియన్​ గేమ్స్​లో తొలిస్థానం కైవసం చేసుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాడు డియాకోమిహలిస్​ అమెరికా ఛాంపియన్​షిప్​ సహా ఇప్పటివరకు 47 మ్యాచ్​ల్లో తలపడగా ఒక్కసారీ ఓడిపోలేదు.

ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్​కు ఆతిథ్యమిస్తోంది న్యూయర్క్​ మాడిసన్​ స్క్వేర్​​. 2014లో మోదీ ఇక్కడ నుంచే భారతీయులకు సందేశమిచ్చారు.

'మాడిసన్​ స్క్వేర్​ గార్డెన్​ ప్రఖ్యాత వేదిక. ఇక్కడ పోటీలో పాల్గొనేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఈ ఫైట్​ నన్ను నేను మరింత మంచి రెజ్లర్​గా మార్చుకునే గొప్ప అవకాశం'.

--భజరంగ్​ పునియా, భారత రెజ్లర్​

ABOUT THE AUTHOR

...view details