మోకాలి గాయం ఓవైపు వేధిస్తున్నా సరే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం గురించి భారత యువ రెజ్లర్ బజ్రంగ్ పూనియా మాట్లాడాడు. కాలు విరిగిన సరే పతకమైతే గెలవాలన్న కసితో కాంస్య పతక పోరులో ఆడాడని తెలిపాడు.
"ఒలింపిక్స్‌కు ముందు నా కుడి మోకాలికి గాయమైంది. అసలు విశ్వక్రీడల్లో ఆడటంపై సందిగ్ధత ఏర్పడింది. డాక్టర్ల సూచనలతో టోక్యోలో మ్యాచ్‌లు ఆడాను. వారు నా మోకాలికి పట్టీలు ఇచ్చారు.ప్లేఆఫ్‌కు మ్యాచ్‌లకు కాలికి పట్టీ ధరించి ఆడాల్సి వచ్చింది. దీనివల్ల నా ఫుట్‌వర్క్ కదలికలకు అడ్డంకి ఏర్పడింది. అందుకే సెమీస్‌లో ఓడిపోయాను. దీంతో కాంస్య పతక పోరులో నేను పట్టి లేకుండానే బరిలోకి దిగాలని నిశ్చయించుకున్నాను. కాలి గాయం ఎక్కువైనా సరే పతకమైతే గెలవాలనుకున్నా. చివరికి అది విరిగితే సర్జరీ చేయించుకోవడానికి సిద్ధపడ్డాను"