తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెజ్లర్​ బజరంగ్ పూనియాకు రాజీవ్ ఖేల్​రత్న - mary kon

ప్రఖ్యాత రాజీవ్​గాంధీ ఖేల్​రత్న అవార్డు కోసం రెజ్లర్​ బజరంగ్ పూనియా నామినేట్ అయ్యాడు. 12 మంది సభ్యుల కమిటీ పూనియా పేరును ఖరారు చేసింది.

ఖేల్​రత్న అవార్డు కోసం రెజ్లర్​ బజరంగ్ పూనియా

By

Published : Aug 16, 2019, 4:40 PM IST

Updated : Sep 27, 2019, 4:59 AM IST

ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్​లో బంగారు పతకం గెల్చుకున్న భారత్ రెజ్లర్ బజరంగ్​ పూనియా.. ప్రఖ్యాత రాజీవ్​గాంధీ ఖేల్​రత్న పురస్కారానికి నామినేట్​ అయ్యాడు. బైచుంగ్ భూటియా, మేరీకోమ్​ ఉన్న 12 మంది సభ్యుల కమిటీ ఇతడి పేరును ప్రతిపాదించింది. దీనిపై ఆనందం వ్యక్తం చేశాడు ఈ రెజ్లర్.

బజరంగ్​ పూనియా

గతేడాది మలేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు బజరంగ్. గోల్డ్​కోస్ట్ కామన్వెల్త్​ గేమ్స్​లో అదే కేటగిరీలో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రెండు సార్లు పతకాలు పొందాడు. వచ్చే సంవత్సరం జరిగే టోక్సో ఒలింపిక్స్​ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు.​

ఇది చదవండి: విరాట్ కోహ్లీ ప్రత్యేకం: రన్​ మెషీన్​... రికార్డులు చెదిరెన్..!​

Last Updated : Sep 27, 2019, 4:59 AM IST

ABOUT THE AUTHOR

...view details