దిల్లీ వేదికగా జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అదరగొట్టేశారు. పలు విభాగాల్లో నలుగురు రెజ్లర్లు ఫైనల్‌కు చేరారు. భజరంగ్ పునియా(65 కేజీలు), రవి దహియా(57 కేజీలు), సత్యవర్త్ కడియన్(97 కేజీలు), గౌరవ్ బలియన్(79 కేజీలు) ఉన్నారు. వీరు ఇప్పటికే రజతాలు ఖాయం చేసుకున్నారు.
భజరంగ్ ఫామ్
టోక్యో ఒలింపిక్స్ ముందు జరుగుతున్న ఈ మెగాటోర్నీలో సత్తా నిరూపించుకున్నాడు భజరంగ్. ఆసియా గేమ్స్‌లో పసిడి గెలిచిన ఇతడు.. వరుసగా ముగ్గురు స్టార్ రెజ్లర్లను ఓడించాడు. తొలుత షరిఫోవ్(తజకిస్థాన్), క్వార్టర్స్‌లో అబ్బోస్ రక్‌మనోవ్(ఉజ్బెకిస్థాన్), సెమీస్‌లో అమిర్ హొస్సేన్(ఇరాన్)ను ఓడించి ఫైనల్ చేరాడు. ముగ్గురిపైనా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. తుది పోరులో 2018 వరల్డ్ ఛాంపియన్ టకుటో ఒటోగురో(జపాన్)తో తలపడనున్నాడు.