భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. జార్జియా వేదికగా జరుగుతున్న 'తిబిలిసి గ్రాండ్ ప్రీ' టోర్నీలో విజేతగా నిలిచి... ఈ ఏడాది నాలుగో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి పిమన్ బిబ్యాని(ఇరాన్)ను ఓడించి ఈ ఘనత సాధించాడు. 65 కేజీల పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో పాల్గొన్న భారత ఆటగాడు... బిబ్యానిపై 2-0 తేడాతో గెలిచాడు.
ఈ ఏడాది కొలోవ్ నికోలా ప్రెటోవ్ టోర్నీ , ఆసియా ఛాంపియన్షిప్, అలీ అలియెవ్ టోర్నీలో స్వర్ణాలు సాధించాడు భజరంగ్.