భారత రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో రెండోసారి అగ్రస్థానానికి ఎగబాకాడు. గత నవంబర్‌లో తొలిసారి నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకున్న పూనియా.. 65 కేజీల విభాగంలో ఈ ఘనత సాధించాడు.
రెజ్లింగ్‌లో రెండోసారి అగ్రస్థానంలో భజరంగ్
ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును మళ్లీ కైవసం చేసుకున్నాడు భారత రెజ్లర్ భజరంగ్ పూనియా. గత నవంబరులో తొలిసారి అగ్రస్థానానికి అందుకున్నాడు. ప్రస్తుతం చైనాలో జరగనున్న ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు సన్నద్ధమవుతున్నాడు.
భజరంగ్ పూనియా
ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటి.. బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు భజరంగ్. గత ఏడాది జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ రజతం సాధించి 58 ర్యాంకింగ్ పాయింట్లు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం భజరంగ్ ఏప్రిల్ 23 నుంచి చైనాలో జరగనున్న ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు సన్నద్ధమవుతున్నాడు. గత నెలలో బల్గేరియాలో జరిగిన డాన్ కోలోవ్ - నికోలా పెట్రోవ్ టోర్నమెంటులో బంగారు పతకాన్ని గెలిచాడీ 25 ఏళ్ల రెజ్లర్.