తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియన్ ఛాంపియన్​షిప్​లో పసిడి నెగ్గిన పునియా

భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా ఆసియన్​ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం నెగ్గాడు. కజకిస్థాన్​కు చెందిన ఒకసోవ్​పై 12-7 తేడాతో గెలిచాడు. మరో రెజ్లర్​ పర్వీన్ రానా 79 కేజీల విభాగంలో ఫైనల్​ చేరాడు.

బజరంగ్ పునియా

By

Published : Apr 23, 2019, 9:06 PM IST

ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్​షిప్​లో భారత రెజ్లర్​ బజరంగ్ పునియా స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. చైనా జియాన్ వేదికగా జరుగుతన్న ఫైనల్లో కజకిస్థాన్​కు చెందిన ఒకసోవ్​పై 12-7 తేడాతో గెలిచాడు. పురుషుల 65 కేజిల విభాగంలో పోటీపడిన బజరంగ్ రెండో సారి ఈ ఛాంపియన్​షిప్​లో పసిడిని పొందాడు. 2017లో తొలిసారి ఈ ఘనత సాధించాడు బజరంగ్.

మ్యాచ్​ ప్రారంభంలో 2-7తో వెనకంజలో ఉన్న పునియా అనంతరం ఎటాకింగ్​కు దిగాడు. కేవలం 60 సెకన్లలోనే 8 పాయింట్లు సాధించాడు. వరుసగా 10 పాయింట్ల నెగ్గి ప్రత్యర్థికి మరో అవకాశమివ్వలేదు బజరంగ్. కజకిస్థాన్ ఆటగాడు ఒకసోవ్​పై ఒత్తిడి పెంచి సత్తా చాటాడు బజరంగ్.

మరో భారత రెజ్లర్ పర్వీన్ రానా ఫైనల్​ చేరాడు. 79 కేజీల విభాగంలో కజకిస్థాన్​కు చెందిన ఉస్సెర్​బియేవ్​పై 3-2 తేడాతో గెలిచి స్వర్ణంపై కన్నేశాడు. ఫైనల్​లో ఇరాన్​కు చెందిన మొహమ్మద్​ తెయ్​మూరితో తలపడనున్నాడు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే ఐదు పతకాలు గెలుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details