తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: త్వరలో ఒలింపిక్స్.. మరోవైపు భారీగా కేసులు - tokyo olympics

ఒలింపిక్స్(Tokyo Olympics) ఆతిథ్య నగరం​ టోక్యోలో కరోనా కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో సమావేశమైన జపాన్​ ప్రధాన మంత్రి యోషిహిదే సుగ, అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​.. విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని హామీ ఇచ్చారు.

Olympics
ఒలింపిక్స్​

By

Published : Jul 14, 2021, 8:04 PM IST

మరో వారం రోజుల్లో ఒలింపిక్స్(Tokyo Olympics)​ ప్రారంభంకానున్న నేపథ్యంలో టోక్యో నగరంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అక్కడ అత్యయిక స్థితి కూడా విధించారు. వరుసగా 25 రోజులు నుంచి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కేసులు సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఆరునెలల క్రితం జనవరి 22న 1,184 కేసులు రాగా.. ఆ తర్వాత రికార్డుస్థాయిలో బుధవారం(జులై 14) 1,149 కొత్త కేసులు నమోదవ్వడం కలవరపెడుతోంది.

ప్రధానితో భేటీ

కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఒలింపిక్స్​ నిర్వహణ గురించి అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​.. జపాన్​ ప్రధాన మంత్రి యోషిహిదే సుగతో కలిసి చర్చించారు. ఈ మెగాక్రీడలు నిర్వహించడానికి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారో వివరించారు. మొత్తంగా ఇద్దరు కలిసి విశ్వక్రీడలు సురక్షితంగా జరుగుతాయని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సమావేశంలో భాగంగా మెగాక్రీడల్లో పాల్గొనే 85 శాతం మంది అథ్లెట్లు, అధికారులు వ్యాక్సినేషన్​ వేయించుకున్నారని బాచ్​ తెలిపారు. ఐఓసీ సభ్యులు, సిబ్బంది కూడా దాదాపుగా ప్రతిఒక్కరూ టీకాలు తీసుకున్నారని వెల్లడించారు.

ఇదీ చూడండి:

Olympics: భారత అథ్లెట్ల కోసం స్పెషల్​ సాంగ్​

ప్చ్.. ఒలింపిక్స్​లో ఈ స్టార్ ప్లేయర్స్​ను చూడలేం!

ABOUT THE AUTHOR

...view details