రెడ్‌బుల్ డ్రైవర్ సెర్గీ పెరెజ్ అజర్‌బైజాన్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు. ముందు దూసుకుపోతోన్న మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) కారు ప్రమాదానికి గురికావడం పెరెజ్‌కు కలిసొచ్చింది. హామిల్టన్ (మెర్సీడజ్) కారు ట్రాక్ తప్పడం వల్ల 15వ స్థానానికి పడిపోయాడు. 54 రేసుల తర్వాత అతడు పాయింట్లు లేకుండా రేసును ముగించాడు.
Azerbaijan Grand Prix విజేతగా పెరెజ్ - అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్
రెడ్‌బుల్ డ్రైవర్ సెర్గీ పెరెజ్ అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్‌కే చెందిన వెర్‌స్టాపెన్ కారు ప్రమాదానికి గురికావడం పెరెజ్‌కు కలిసొచ్చింది. హామిల్టన్ 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
![Azerbaijan Grand Prix విజేతగా పెరెజ్ perez](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12042242-796-12042242-1623027650158.jpg)
పెరెజ్
వెటెల్ రెండో స్థానం సాధించాడు. గాస్లీ (అల్ఫాతౌరి హోండా) మూడో స్థానంలో నిలిచాడు. పొల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన లీక్లెర్క్ (ఫెరారీ) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.