తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2019, 9:37 AM IST

ETV Bharat / sports

భారత అథ్లెట్​కు ఓవైపు ఆనందం.. మరోవైపు బాధ

భారత స్టీపుల్ ఛేజ్​ రన్నర్ అవినాశ్​ సేబల్.. అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో ఆకట్టుకోకపోయినా, జాతీయ రికార్డు సాధించాడు. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు.

భారత స్టీపుల్ ఛేజ్​ రన్నర్ అవినాశ్​ సేబల్

ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో భారత రన్నర్​ అవినాశ్​ సేబల్ నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్​ ఛేజ్​ ఫైనల్లో 13వ స్థానంలో నిలిచాడు. అయినప్పటికీ జాతీయ రికార్డు సాధించాడు. ఆపై టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాడు. తన జాతీయ రికార్డు తానే బద్దలుకొట్టడం ఈ అథ్లెట్​కిది రెండోసారి.

ఈ రేసును 8:21.37 నిమిషాల్లో పూర్తి చేసిన అవినాశ్.. ఒలింపిక్ అర్హత సమయం 8:22 నిమిషాల కంటే ముందున్నాడు. అదే విధంగా తన పేరిట ఉన్న జాతీయ రికార్డును (8:25 నిమిషాలు) అధిగమించాడు. ఈ పోటీలో కిప్​రుటో (8:01.35; కెన్యా) స్వర్ణం సాధించాడు.

ఇది చదవండి: అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ నుంచి జాన్సన్ ఔట్

ABOUT THE AUTHOR

...view details