Australia Open Sania Mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి సానియా- అనా డానిలీనా జోడీ నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండో-కజఖ్ జోడీ బెల్జియంకు చెందిన అలిసన్ వాన్ యుట్వాంక్, ఉక్రెయిన్‌కు చెందిన అన్‌హెలినా కాలినినా చేతిలో 4-6, 6-4, 2-6తో ఓటమిపాలైంది. దీంతో గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి.
Australia Open: డబుల్స్ నుంచి సానియా జోడీ ఔట్.. గ్రాండ్ స్లామ్ టైటిల్ ఆశలు ఆవిరి! - ఆస్ట్రేలియన్ ఓపెన్ అప్డేట్లు
ఆస్ట్రేలియన్ ఓపెన్.. డబుల్స్ నుంచి సానియా జోడీ నిష్క్రమించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండో-కజఖ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. దీంతో మిక్స్‌డ్ డబుల్స్‌పైనే ఆశలు పెట్టుకుంది సానియా.
ఇక మిక్స్‌డ్ డబుల్స్‌పైనే ఆశలు పెట్టుకుంది సానియా. శనివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మీర్జా – రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. రియో 2016 సెమీ-ఫైనలిస్టులు సానియా మీర్జా -రోహన్ బోపన్న 1.14 గంటల్లో 7-5, 6-3 స్కోరుతో ఆస్ట్రేలియా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జామీ ఫోర్లిస్-ల్యూక్ సవిల్లె జోడీని ఓడించింది.
ఇదిలా ఉండగా.. సానియా త్వరలో టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించినుంది. తన కెరీర్‌లోనే ఇది ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అని, ఫిబ్రవరిలో జరిగే దుబాయి ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ఇటీవల విడుదల చేసిన నోట్‌లో తెలిపింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని వెల్లడించింది. ఈ మేరకు మూడు పేజీల నోట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇందులో టెన్నిస్‌లో తన సుదీర్ఘ ప్రయాణం, పోరాటం గురించి వివరించిన సానియా.. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.