Australian open Sania mirza: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్ రామ్(అమెరికా) జోడీ విజయాన్ని అందుకుంది. రెండో రౌండ్లో మాట్వే మిడిల్కూపా(నెదర్లాండ్స్)-ఎల్లెన్ పెరెజ్ (ఆస్ట్రేలియా) జోడీని 7-6(4)-6-4 తేడాతో సానియా ద్వయం ఓడించింది. తద్వారా ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు సానియా-రామ్.
ఈ మ్యాచ్ గంట 27 నిమిషాల పాటు సాగింది. మొదటి రౌండ్లో రెండు జోడీలు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో సెట్‌ను కైవసం చేసుకునేందుకు సానియా జోడీ తీవ్రంగా శ్రమించింది. అనంతరం మాట్వే-ఎల్లెన్ల చేసిన తప్పిదాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న సానియా ద్వయం మొదటి సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో సెట్లో వీరు పూర్తి ఆధిపత్యం వహించారు. దీంతో ఈ టోర్నీలో రెండో విజయం సాధించి క్వార్టర్స్ చేరుకున్నారు.