తెలంగాణ

telangana

ETV Bharat / sports

Australian Open: రెండో రౌండ్​కు నాదల్​.. విమానంలో స్వదేశానికి జకోవిచ్​ - novac djakovic reached serbia

Australian Open: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్​.. ఆస్ట్రేలియన్ ఓపెన్​ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. అమెరికా ఆటగాడు మార్కస్​ గిరాన్​పై తొలిరౌండ్లో ఘన విజయం సాధించాడు. మరోవైపు టీకా తీసుకోని కారణంగా టోర్నీకి దూరమైన డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్​ జకోవిచ్​.. విమానంలో స్వదేశం చేరుకున్నాడు.

Australian Open, నాదల్
ఆస్ట్రేలియన్​ ఓపెన్​ రెండో రౌండ్​కు నాదల్

By

Published : Jan 17, 2022, 7:27 PM IST

Australian Open: స్పెయిన్​ బుల్ రఫెల్​ నాదల్​ ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్​లోకి దూసుకెళ్లాడు. 109 నిమిషాల పాటు సాగిన పోరులో అమెరికాకు చెందిన మార్కస్​ గిరాన్​ను 6-1, 6-4, 6-2 తేడాతో ఓడించాడు. ఫలితంగా ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో 70వ విజయం నమోదు చేసి రికార్డు సృష్టించాడు. రెండో రౌండ్​లో జర్మనీ ఆటగాడు యన్నిక్​ హాన్ఫ్​మన్ లేదా ఆస్ట్రేలియా ప్లేయర్​ తనాసి కొక్కినాకిస్​లో ఒకరితో తలపడనున్నాడు.

నాదల్ 70వ విజయం

అంతకుముందు తొలిసారి గ్రాండ్​ స్లామ్ సీడ్​ సాధించిన కార్లోస్​ అల్కరాజ్​.. చిలీ ఆటగాడు అలెజాండో తబిలోను 6-2, 6-2, 6-3 తేడాతో ఓడించాడు.

స్వదేశం చేరుకున్న జకోవిచ్​..

వ్యాక్సిన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్​లో పాల్గొనేందుకు అనుమతి పొందలేకపోయిన టెన్నిస్ దిగ్గజం, ఢిపెండింగ్ ఛాంపియన్​ నొవాక్ జకోవిచ్ స్వదేశం చేరుకున్నాడు. ఆసీస్​ నుంచి అతడు దుబాయ్ మీదుగా విమానంలో సెర్బియా రాజధాని బెల్​గ్రేడ్​కు వెళ్లాడు. ఎన్నో నాటకీయ పరిణామాలు, న్యాయపోరాటం తర్వాత అతడు ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పాల్గొనకుండా వెనుదిరగాల్సి వచ్చింది. టీకా తీసుకోని వారిని టోర్నీలో ఆడనివ్వమని ఆస్ట్రేలియా ప్రభుత్వం తేల్చిచెప్పింది.

స్వదేశం చేరుకున్న జకోవిచ్​

ఫ్రెంచ్ ఓపెన్​కూ దూరం!

జకోవిచ్​కు మరో షాక్ కూడా తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. వ్యాక్సిన్​ తీసుకోకపోవడం వల్ల అతడు ఫ్రెంచ్ ఓపెన్​లో పాల్గొనడంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. టీకా తీసుకోకపోతే జకోవిచ్​ను టోర్నిలో ఆడనివ్వబోమని ఫ్రెంచ్ క్రీడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు రాయిటర్స్​ వార్త సంస్థ వెల్లడించింది. దీంతో అతడు ఈ టోర్నీకి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:కెప్టెన్సీ అప్పగిస్తే గొప్ప గౌరవంగా భావిస్తా: బుమ్రా

ABOUT THE AUTHOR

...view details