Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత ఆటగాళ్లు నిరాశ పరిచారు. ఓపెనింగ్ రౌండ్లోనే ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ ఈవెంట్లో భారత టెన్నిస్ స్టార్ బోపన్న, ఫ్రాన్స్‌కు చెందిన రోజర్ వసెలిన్(Edouard roger- vasselin) జోడీ తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. ఫిలిప్పైన్స్కు చెందిన ట్రీట్ హువే, ఇండోనేసియా ఆటగాడు క్రిస్టోఫర్ రంగ్కాట్ జంట చేతిలో 3-6, 7-6(2), 6-2 తేడాతో పరాభవం చెందింది.
ఓటమి బాటలో సానియా..
మహిళల డబుల్స్ ఈవెంట్లో భారత్‌కు చెందిన సానియా మీర్జా, ఉక్రెయిన్ ప్లేయర్ నదియా కిచెనోక్ జంట ఓపెనింగ్ రౌండ్లోనే ఓడిపోయింది. స్లొవేనియాకు చెందిన కాజా జువన్, తమర జిడన్సెక్ జంట చేతిలో 6-4, 7-6 తేడాతో ఓటమి చవిచూసింది.