Australian Open: ఆస్ట్రేలియన్ల 42 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆ దేశ క్రీడాకారిణి ఆష్లే బార్టీ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో మాడిసన్ కీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో బార్టీ 6-1, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 1980లో వెండీ టర్న్‌బల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ చేరింది. తాజా విజయంతో 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా బార్టీ నిలిచింది.
మరో సెమీస్ మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి డేనియెల్ కొలిన్స్ 6-4, 6-1 తేడాతో ఇగా స్వెతెక్‌పై విజయం సాధించి తొలిసారిగా ఫైనల్ చేరింది. శనివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్స్‌లో బార్టీ విజయం సాధిస్తే 1978 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించనుంది. 1978లో క్రిస్ ఓ నీల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచింది.