Australian Open 2022: ఓ పక్క గాయాలు.. మరోవైపు పెరుగుతున్న వయస్సు.. కుర్రాళ్లతో పోటీ.. అయితే ఇవేమీ అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును సాధిద్దామనే కలను ఆపలేకపోయాయి. పాతికేళ్ల యువకుడు మెద్వెదెవ్ మీద 35 ఏళ్ల రఫెల్ నాదల్ ఐదు సెట్ల పోరులో దాదాపు 5 గంటల 24 నిమిషాలపాటు పోరాడి మరీ విజయం సాధించాడు. 2-6, 6-7, 6-4, 6-4,7-5 తేడాతో మెద్వెదెవ్‌ను ఓడించడం సంచలనమనే చెప్పాలి.
అయితే.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో దిగ్గజ టెన్నిస్ స్టార్లు జకోవిచ్, రోజర్ ఫెదరర్ లేకపోయినా మెద్వెదెవ్, సిట్సిపాస్, వెరెవ్, బెరెట్టిని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. వారందరినీ తోసిరాజని తన అనుభవంతో నాదల్ 21వ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది తన రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.
2012 జకోవిచ్ చేతిలో..
తొలుత 2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫేల్.. 13 ఏళ్ల తర్వాత రెండోసారి ఈ టైటిల్‌ను గెలిచి రికార్డు సృష్టించాడు. అయితే.. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోనూ మారథాన్ మ్యాచ్ ఆడి గెలుపుకోసం పోరాడాడు. కానీ, నొవాక్ జకోవిచ్ చేతిలో పరాభవం పాలయ్యాడు. ఈ మ్యాచ్ దాదాపు 5 గంటల 53 నిమిషాల పాటు జరిగింది. జకోవిచ్ 5-7, 6-4, 6-2, 6-7(5-7), 7-5 తేడాతో నాదల్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు.
నాదల్@21..