తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోర్టులో జకోవిచ్​కు ఊరట.. వీసా పునరుద్ధరణ - జకోవిచ్ క్వారంటైన్

Djokovic Visa: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు మెల్​బోర్న్ కోర్టులో ఊరట లభించింది. ఇతడి వీసాను పునరుద్ధరించాలని కోర్టు తీర్పు వెలువరించింది. మెల్​బోర్న్ హోటల్ క్వారంటైన్​ నుంచి జకోను వెంటనే రిలీజ్ చేయాలిని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Djokovic Visa
Djokovic Visa

By

Published : Jan 10, 2022, 12:26 PM IST

Updated : Jan 10, 2022, 1:02 PM IST

Djokovic Visa: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్​కు మెల్​బోర్న్ ఫెడరల్ కోర్టులో ఊరట లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్​లో పాల్గొనేందుకు వచ్చిన ఇతడి వీసాను వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు రద్దు చేయడాన్ని తప్పుబట్టింది కోర్టు. వెంటనే అతడిని మెల్​బోర్న్ క్వారంటైన్ నుంచి విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం వార్నింగ్

కోర్టు కేసులో నెగ్గిన జకోవిచ్​కు ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం హెచ్చరిక జారీ చేసింది. ఈ కేసులో తిరిగి అప్పీల్ చేస్తామని ఆ దేశ మంత్రి తెలిపారు. జకో వీసా ర‌ద్దు కోసం ఇమ్మిగ్రేష‌న్ కార్యాల‌యం చర్య‌లు చేప‌డుతుంద‌ని ప్ర‌భుత్వ లాయ‌ర్ ట్రాన్ తెలిపారు.

ఇదీ జరిగింది

జకోవిచ్‌ ఈ సీజన్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ టోర్నీ అయిన 'ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌'లో పాల్గొనేందుకు నాలుగు రోజుల క్రితం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. సరైన వీసా అనుమతులు, వైద్యపరమైన మినహాయింపులున్నా.. వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. జకోవిచ్‌ వీసాను రద్దు చేసి డిటెన్షన్‌ సెంటర్‌లో ఉంచారు. ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారగా.. అక్కడే ఉన్న జకోవిచ్‌ ఆస్ట్రేలియా తీరుపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాడు. ఈ క్రమంలోనే శనివారం తన లాయర్ల ద్వారా వాదనలు వినిపించాడు జకోవిచ్. సోమవారం దీనిపై తీర్పు వెలువరించింది ఫెడరల్ కోర్టు.

ఇవీ చూడండి: కరోనా సోకిన మరునాడే టోర్నీలో.. జకోవిచ్ తీరుపై విమర్శలు

Last Updated : Jan 10, 2022, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details