ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్(సెర్బియా) దూకుడు ప్రదర్శిస్తున్నాడు. నేడు(మంగళవారం) జరిగిన పోటీల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌లో బరిలో దిగి గెలిచిన అతడు సెమీస్‌కు చేరుకున్నాడు. నాలుగు గంటల పాటు జరిగిన ఈ పోరులో డెనిస్ షపొవలోవ్‌ను(Denis Shapovalov) 6-3,6-4,4-6,3-6,6-3 తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం అతడికిది 7వ సారి కాగా గ్రాండ్‌స్లామ్‌లో 36వ సారి. ఫైనల్లో అతడు గెలిస్తే కెరీర్లో 21వ గ్లాండ్స్లామ్ టైటిల్‌ను ముద్దాడి.. పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్(20), జకోవిచ్‌ను(20) అధిగమించి అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కుతాడు.
యాష్ బార్టీ కూడా జోరు కొనసాగిస్తోంది. క్వార్టర్స్‌లో 6-2,6-0 తేడాతో జెస్సికా పెగులాను ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 63 నిమిషాల పాటు సాగిందీ పోరు.
ఇదీ చూడండి: