భారత అథ్లెట్లిక్స్ కోచ్, బెలారస్‌కు చెందిన నికోలై స్నెసారెవ్ పటియాలా నేషనల్ స్టోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లోని(ఎన్ఐఎస్) హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.
భారత అథ్లెటిక్స్ కోచ్ నికోలై అనుమానాస్పద మృతి! - పటియాలా నేషనల్ స్టోర్ట్స్ ఇనిస్టిట్యూట్
భారత అథ్లెటిక్స్ కోచ్ నికోలై మృతి చెందారు. పటియాలాలోని స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ గదిలో ఆయన అచేతన స్థితిలో కనిపించారని, ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ తెలిపింది.
భారత అథ్లెటిక్ కోచ్ నికోలై స్నెసారెవ్ మృతి
నికోలై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆయన మృతికి కారణాలేంటో తెలియాల్సి ఉందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అడిల్లే సుమరివాలా తెలిపారు.
ఇదీ చదవండి:'బంతి గమనాన్ని బట్టే నా ఆట ఉంటుంది'
Last Updated : Mar 5, 2021, 9:50 PM IST