తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆటకు దిగితే హడల్.. ఫ్యాషన్​లో జిగేల్!

మైదానంలో వాళ్లు పోటీకి దిగితే ప్రత్యర్థులకు బెదురు.. ఫ్యాషన్‌ వేదికలపైన కాలు మోపితే మోడళ్లకీ తీసిపోరు.. సోషల్‌ మీడియాలో సరదాలకూ, పోజులకూ కొదవ లేదు. అటు ఆటతో.. ఇటు ఫ్యాషన్‌తో ఆడేసుకుంటున్న ఈతరం క్రీడాతారలు కొందరి గురించి..

pv sindu
ఫ్యాషన్‌లోనూ రాణిస్తున్న క్రీడాతారలు

By

Published : Aug 8, 2021, 9:46 AM IST

అటు ఆటలో.. ఇటు ఫ్యాషన్​లో రాణిస్తున్న క్రీడాకారిణులు ఎందరో. నిత్యం సామాజిక మాధ్యమాల్లో పోజులతో అభిమానులను ఆకర్షిస్తుంటారు. అలాంటి వారిలో కొందరు మీ కోసం..

ఆటతోపాటు: పీవీ సింధు

పీవీ సింధు

పద్మభూషణ్‌, పద్మశ్రీ గ్రహీత. 26 ఏళ్ల పీవీ సింధు తాజాగా టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించింది. దీంతో రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలను దక్కించుకున్న క్రీడాకారిణిగా చరిత్రలోకెక్కింది. ఈ తెలుగింటి ఆడపడుచు ఆటలోనే కాదు ఫ్యాషన్‌లోనూ ముందంజలోనే ఉంటానంటూ నయా ట్రెండ్స్‌ను నేటితరానికి పరిచయం చేస్తుంటుంది. దివా గౌను నుంచి షిమ్మరీ మినీ డ్రస్‌లతో తళుక్కుమంటూ మెరిసిపోతోంది. ఒయ్యారంగా ష్యాషన్‌ వేదికలపైనా అడుగులేస్తోంది. క్రీడాశిక్షణతో తీర్చిదిద్దినట్లుండే ఈమె శరీరసౌష్టవం ఫ్యాషన్‌ దుస్తుల్లో ఇట్టే ఇమిడిపోతుంది. సంప్రదాయ దుస్తులతోపాటు.. తను ధరించే ఆధునిక దుస్తులూ ఫ్యాషన్‌ సెన్స్‌ను చూపిస్తుంటాయి.

ఇక్కడా అదే వేగం: మనికాబత్రా

మనికాబత్రా

టేబుల్‌టెన్నిస్‌ క్రీడాకారిణి, ఖేల్‌రత్న అవార్డు గ్రహీత 26 ఏళ్ల మనికాబత్రాకు ఫ్యాషన్‌ సెన్స్‌ ఎక్కువ. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంది. కోర్టులో మెరుపువేగంతో కదిలే ఈమె, ఎప్పటికప్పుడు మారే ఫ్యాషన్‌నూ అనుసరిస్తుంది. తన వార్డ్‌రోబ్‌లో జంప్‌ సూట్స్‌, డెనిమ్‌ ప్యాంట్లు, స్వెట్‌షర్ట్‌లే ఎక్కువట. సందర్భాన్నిబట్టి పవర్‌సూట్స్‌, బ్లేజర్‌ ఇన్‌స్పైర్డ్‌ గౌన్లు, వెల్వెట్‌ ప్యాంట్లూ వేస్తుంది. ఈమె అభిరుచికి నెటిజన్లు ఎప్పటికప్పుడు ఫిదా అవుతుంటారు. తెలుపు చొక్కాలంటే మనసు పారేసుకునే మనికా దాన్ని ప్రతి అవుట్‌ఫిట్‌పై మ్యాచింగ్‌ చేసి, ఫ్యాషన్‌ ఐకాన్‌గా అప్పటికప్పుడు మారిపోగలదు. అంతేకాదు.. చీర, కుర్తా వంటి సంప్రదాయ దుస్తుల్లోనూ మెరిసిపోతుంది.

విరాట్‌కే స్ఫూర్తి: దీపికా పల్లికల్‌

దీపికా పల్లికల్‌

క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ భార్య కాకముందే దీపిక తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె స్క్వాష్‌ క్రీడాకారిణి. స్క్వాష్‌లో వరల్డ్‌ టాప్‌ 10లో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయ క్రీడాకారిణి దీపిక. పద్మశ్రీ గ్రహీత. అర్జున అవార్డును అందుకున్న తొలి స్క్వాష్‌ ప్లేయర్‌ కూడా. ఈ చెన్నై అమ్మాయి ప్రొఫెషనల్‌ మోడల్‌ కూడా. అప్పుడప్పుడూ ర్యాంప్‌లపై హొయలు పోతుంది. ఫెమెనా వంటి బ్యూటీ మేగజీన్ల కవర్‌ పేజీలపైనా మెరిసింది. గ్లోబస్‌ లిమిటెడ్‌, అడిడాస్‌, వీనస్‌ వంటి ప్రముఖ సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ చేసింది. క్రీడలవైపు రాకపోయుంటే కచ్చితంగా సినిమాల్లో ప్రయత్నించి ఉండేదాన్నంటోంది. ఆ కోరికనే మోడలింగ్‌ ద్వారా తీర్చుకుంటోందట. స్నేహితురాలితో కలిసి ఓ ఫ్యాషన్‌ బ్రాండ్‌నూ ప్రారంభించబోతోంది. ఆరోగ్యం, వ్యాయామంపైనా ఎక్కువ దృష్టిపెడుతుంది. ఫిట్‌నెస్‌ పరంగా ఎంతో పేరున్న విరాట్‌ కోహ్లీనే ఈమెను చూసి స్ఫూర్తిపొందానని చెప్పాడంటే తన ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. చీలమండ గాయం కారణంగా రెండేళ్లుగా ఆటకు దూరమైన దీపిక ఈ ఏడాది నుంచే తిరిగి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది.

సినిమా అవకాశమొచ్చినా: వేదా కృష్ణమూర్తి

వేదా కృష్ణమూర్తి

ఉమెన్‌ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌. ఆటతోనే కాదు అందంతోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. 13 ఏళ్ల వయసులోనే ఫార్మల్‌ క్రికెట్‌లోకి ప్రవేశించిన ఈమెకి సినిమాలంటే పిచ్చి. ఏమాత్రం ఖాళీ దొరికినా థియేటర్లకి చెక్కేస్తుంది. ఓ సినిమా అవకాశమొచ్చినా ఆటపై ప్రభావం పడుతుందని నో చెప్పిందట. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఫ్యాషన్‌పై మాత్రం ఓ లుక్కేసుంచుతానంటోంది. పలు ర్యాంప్‌ వాక్‌లతోపాటు మేగజీన్‌ కవర్లమీదా మెరిసింది. సంప్రదాయం, ఆధునికం.. నచ్చిన స్టైల్స్‌ అన్నీ ప్రయత్నిస్తుంది. టాటూలన్నా మక్కువే. తన ఇన్‌స్టాలో ఆట వివరాలనే కాకుండా తన స్టైలిష్‌ లుక్‌నీ అభిమానులతో పంచుకుంటుంటుంది.

బంగారు చేపపిల్ల: మానా పటేల్‌

మానా పటేల్‌

నీటిలో చేపపిల్లలా వేగంగా కదిలే 21 ఏళ్ల మానా పటేల్‌ కొత్తట్రెండ్స్‌లోనూ అదే వేగంతో దూసుకుపోగలదు. పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 10 స్వర్ణం, అయిదు వెండి, రజత పతకాలను సాధించిన క్రీడాకారిణి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొంది. మోడల్స్‌కు తీసిపోని అందంతో ఆధునిక దుస్తుల్లో తళుక్కుమని మెరవగలదు. సౌకర్యాన్ని అందించే ఏ దుస్తులైనా తనను ఆకర్షిస్తాయని చెప్పే ఈమె, తరచూ తన ప్యాషన్‌ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో అభిమానులను అలరిస్తూంటుంది.

ఇదీ చదవండి:Tokyo Olympics: సింధుకు స్వర్ణం సాధించే సత్తా ఉంది

ఈ 'బాలీవుడ్​' ముద్దుగుమ్మలు.. వెరీ వెరీ హాట్!

ABOUT THE AUTHOR

...view details