బ్యాంకాక్ వేదికగా నిర్వహించిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో అతన్దాస్ కాంస్యం సంపాదించాడు. ప్రత్యర్థి జిన్ హయెక్ (కొరియా)పై 6-5 తేడాతో నెగ్గాడు.
ఆర్చరీలో అతన్దాస్కు కాంస్య పతకం - తెలుగు తాజా క్రీడా వార్తలు
బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో పాల్గొన్న అతన్దాస్... కాంస్య పతకం సాధించాడు.
ఆర్చరీలో అతన్దాస్కు కాంస్య పతకం
ఈ పతకానికి ముందు సోమవారం జరిగిన రికర్వ్ మిక్స్డ్ డబుల్స్‌లో దీపికా కుమారితో కలిసి కాంస్యం గెలుపొందాడు అతన్దాస్. మిక్స్డ్ విభాగం ఫైనల్లో మరో భారత జట్టు అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖ కలిసి.. చైనా తైపీస్ ద్వయంతో బుధవారం తలపడనున్నారు.
ఇదీ చూడండి: ముంబయి దాడికి 11 ఏళ్లు- అమరులకు ఘన నివాళులు