స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆమెను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించబోతున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన బుధవారం రాత్రి జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా తదితర వివిధ విభాగాల్లోని క్లాస్-1, క్లాస్-2 ఆఫీసర్లుగా క్రీడాకారులను నియమించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర క్రీడా మంత్రి రిజిజు స్వాగతించారు.
స్టార్ స్ప్రింటర్ హిమదాస్‌కు డీఎస్పీ కొలువు
భారత స్ప్రింటర్ హిమదాస్‌ను డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్ప్రింటర్
ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి క్లాస్ -1, ప్రపంచ ఛాంపియన్షిప్స్ విజేతలను క్లాస్-2 ఆఫీసర్లుగా నియమించనున్నారు. కాగా, 20 ఏళ్ల అసోం స్టార్ స్పింటర్ హిమదాస్.. ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 ఛాంపియన్ షిప్స్‌లో గ్లోబల్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా రికార్డు సాధించింది.