తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీకి చాను సారథ్యం

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్​లో పాల్గొనే  భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. 12 మందితో కూడిన జట్టుకు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను సారథ్యం వహిస్తోంది.

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీకి భారత జట్టిదే

By

Published : Apr 6, 2019, 5:25 PM IST

చైనాలో ఏప్రిల్​ 18 నుంచి ప్రారంభంకానుంది ఆసియా వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్. గెలిస్తే టోక్యో 2020 ఒలింపిక్స్​కు అర్హత సాధించవచ్చు. అందుకే ప్రతిష్ఠాత్మకంగా జట్టును సిద్ధం చేశారు. మీరాబాయి చాను, సతీశ్ శివలింగం, జెరెమీ చోటు దక్కించుకున్నారు.

  • తొమ్మిది నెలలు గాయంతో విశ్రాంతి తీసుకున్న మీరాబాయి.. ఫిబ్రవరిలో జరిగిన ఈజీఏటీ కప్‌లో 49కిలోల విభాగంలో పోటీపడింది. స్నాచ్‌లో 82కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 110కిలోలు ఎత్తి ప్రతిభ చూపింది. ప్రస్తుతం ఆసియా ఛాంపియన్​షిప్​లో 210 కిలోలు లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

2018 కామన్వెల్త్ క్రీడల్లో పసిడితో మెరిసిన తెలుగు తేజం రాగాల వెంకట రాహుల్‌ రిజర్వ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య(ఐడబ్ల్యూఎఫ్) డోపింగ్ కేసులో విధించిన నిషేధం ముగిసినా సంజితా చాను ఆసియా టోర్నీలో పోటీపడటం లేదు.
జట్టు:

  • పురుషులు:

సతీశ్ శివలింగం(81 కేజీలు), వికాస్ ఠాకూర్(96 కేజీలు), జెరెమీ (67 కేజీలు), గురుదీప్‌సింగ్(+101 కేజీలు), ఎమ్​ రాజా(61 కేజీలు), ప్రదీప్‌సింగ్(102 కేజీలు), అచింత(73 కేజీలు) , అజయ్ సింగ్(81 కేజీలు), రాహుల్(రిజర్వ్).

  • మహిళలు:

మీరాబాయి చాను, దాలాబెహెరా, స్వాతి, రాఖీ హల్దర్.

ABOUT THE AUTHOR

...view details