ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత బాక్సర్లు అదరగొడుతున్నారు. 69 కిలోల విభాగంలో వికాస్ కృష్ణన్, లవ్లీనా.. 75 కిలోల విభాగంలో ఆశిష్ కుమార్, పూజా రాణి.. +91 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరుకున్నారు. తద్వారా ఈ ఏడాది టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
టోక్యో ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత బాక్సర్లు అర్హత - boxing olympics 2020
ఈ ఏడాది జరగబోయే ఒలింపిక్స్‌కు భారత్‌కు చెందిన ఐదుగురు బాక్సర్లు అర్హత సాధించారు. వారిలో వికాస్.. మూడోసారి ఈ మెగాటోర్నీ బరిలో దిగుతున్నాడు.
టోక్యో ఒలింపిక్స్ 2020
క్వాలిఫయర్స్‌లోని క్వార్టర్స్‌లో ఒకజవాపై వికాస్.. ముస్కితాపై ఆశిష్.. ఒట్కోన్బాయెర్పై సతీశ్.. చుటీపై పూజా రాణి.. మెలియెవాపై లవ్లీనా విజయం సాధించారు.
భారత్ తరఫున మూడోసారి ఈ మెగాక్రీడలకు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా నిలిచాడు వికాస్ కృష్ణన్. ఇంతకు ముందు విజేందర్ సింగ్ ఈ ఘనత సాధించాడు. ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా.. తొలిసారి ఈ ఒలింపిక్స్‌తోనే బరిలోకి దిగుతున్నారు.