Asian Para Games 2023 :చైనా హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 4వ ఆసియా పారా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. మొదలైన తొలి రోజే ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. పురుష అథ్లెట్లు ఎనిమిది పతకాలు గెలుచుకున్నారు. మహిళా విభాగంలో రెండు, మిక్స్డ్ కేటగిరీలో ఒక పతకం దక్కాయి. ప్రస్తుతం ఇండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. చైనా మొదటి స్థానంలో ఉంది.
Asian Para Games 2023 : ఆసియా పారా గేమ్స్‌లో భారత్ జోరు.. పసిడి సహా మరో రెండు పతకాలు
Asian Para Games 2023 : 2023 ఆసియా పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. సోమవారం జరిగిన వివిధ పోటీల్లో భారత ఆటగాళ్లు స్వర్ణంతో పాటు.. రజతం, కాంస్యం గెలిచారు.
Published : Oct 23, 2023, 10:57 AM IST
|Updated : Oct 23, 2023, 4:10 PM IST
మహిళల వీఎల్2 ఫైనల్లో ప్రాచీ యాదవ్ కనోయింగ్‌లో రజత పతకాన్ని కేవసం చేసుకొని భారత్ ఖాతాను తెరిచింది. పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 ఈవెంట్లో స్వర్ణం, రజతం, క్యాంసం పతకాలు వచ్చాయి. పురుషుల షాట్‌పుట్‌లోనూ కాంస్యంతో భారత్ మెరిసింది. ఇక మిక్స్డ్ 50 మీటర్ల పిస్టోల్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో భారత్ షూటర్ రుద్రాన్ష్ ఖండేల్వాల్ రజతం గెలుచుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో అవని లేఖారా స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగం హైజంప్ టీ63లో భారత్ అథ్లెట్ శైలేశ్ కుమార్ పసిడిని ముద్దాడాడు. ఇదే విభాగంలో శైలేశ్తో పోటీ పడ్డ మరియప్పన్ తంగవేలు రజతం కైవసం చేసుకున్నాడు. అలానే పురషుల హైజంప్ టీ47లో నిషాద్ కుమార్ 2.02 మీటర్ల ఎత్తుతో దూకి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు.
2018 ఇండోనేషియాలో జరిగిన ఎడిషన్‌లో భారత్ 72 పతకాలు సాధిచింది. 15 బంగారు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. గత రికార్డును అధిగమించాలని భారత్ ఆశిస్తోంది. ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన్నట్లుగా.. ఈ పారా ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు రికార్డులు నమోదు చేస్తారని భావిస్తున్నారు.