Asian Games India 100 Medals :ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు నయా చరిత్ర సృష్టించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. ఈసారి ఆసియా పోటీల్లో 100 పతకాలు సాధించి రికార్డు కొట్టింది. ఒక్క శనివారం రోజే భారత్.. 3 స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. దీంతో భారత్ బంగారు పతకాల సంఖ్య 25కు చేరింది. ఇక మరో 35 రజతాలు, 40 కాంస్య పతకాలను భారత అథ్లెట్లు సాధించారు. కాగా పోటీలు ముగియడానికి ఇంకా ఒక రోజు సమయం ఉండడం వల్ల ఈ పతకాల సంఖ్య మరింత పెరగవచ్చు.
Asian Games India 100 Medals : భారత్@100.. ఆసియా గేమ్స్‌లో నయా రికార్డ్.. మోదీ స్పెషల్ విషెస్ - ఆసియా గేమ్స్‌లో భారత్ గోల్డ్ మెడల్స్
Asian Games India 100 Medals : హంగ్జౌ వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత్.. చరిత్రాత్మక మైలురాయి అందుకుంది. ఈ ఆసియా పోటీల్లో భారత్.. 100 పతకాలను ఖాతాలో వేసుకుంది.

Published : Oct 7, 2023, 9:19 AM IST
|Updated : Oct 7, 2023, 10:32 AM IST
మోదీ శుభాకాంక్షలు
ఇంతటి ఘనత అందుకున్న భారత అథ్లెట్లకు దేశ ప్రధాన మంత్రి.. నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "ఆసియా క్రీడల్లో భారత్ గొప్ప ఘనతను సాధించింది. భారత్ 100 పతకాల మైలురాయి అందుకున్నందుకు దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి చారిత్రక విజయాల్ని అందించిన అథ్లెట్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఇక క్రీడాకారుల ప్రతి ప్రదర్శన చరిత్ర సృష్టించటమే కాకుండా దేశ ప్రజలు గర్వపడేలా చేసిందన్నారు. 10వ తేదీన ఆసియా క్రీడల్లో క్రీడాకారుల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారితో సంభాషించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మన బంగారాలు వీళ్లే..
- భారత మహిళల కబడ్డీ జట్టు
- ఓజస్ ప్రవిణ్ డియోటెల్.. ఆర్చరీ
- జ్యోతి సురేఖ వెన్నెం.. ఆర్చరీ
- భారత పురుషుల హాకీ జట్టు
- భారత పురుషుల కాంపౌండ్ టీమ్.. ఆర్చరీ
- భారత పురుషుల మిక్స్డ్ డబుల్స్.. ఆర్చరీ
- భారత మహిళల కాంపౌండ్ టీమ్.. ఆర్చరీ
- పురుషుల రిలే జట్టు
- నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రో
- భారత పురుషుల మిక్స్డ్ కాంపౌండ్.. ఆర్చరీ
- అన్నూ రాణి.. జావెలిన్ త్రో
- పారుల్ చౌదరీ.. 5వేల మీటర్ల రేస్
- తజిందర్ పాల్ సింగ్.. షాట్‌పుట్
- అవినాశ్ సాబ్లే .. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్
- భారత పురుషుల ట్రాప్ జట్టు
- భారత స్క్వాష్ టీమ్
- భారత్ మిక్స్డ్ డబుల్స్ రోహన్ - రుతుజ.. టెన్నిస్
- పాలక్ గులియా.. 10మీ ఎయిర్ పిస్టల్
- భారత పురుషుల జట్టు.. 50మీ రైఫిల్
- భారత పురుషుల జట్టు.. 10మీ ఎయిర్ పిస్టల్
- షిఫ్ట్ కౌర్ సమ్రా.. 50మీ రైఫిల్
- భారత మహిళల జట్టు.. 25మీ పిస్టల్
- భారత్ జట్టు.. ఈక్వస్ట్రియన్