Asian Games 2023 Shooter : ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు వచ్చి చేరాయి. చైనా వేదికగా జరుగుతున్న ఈ ఆసియన్ గేమ్స్‌లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. శుక్రవారం షూటిర్లు గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీపొజిషన్స్ టీమ్(ఎయిర్ పిస్టల్ షూటింగ్ టీమ్ )ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, కుసలే స్వప్నిల్, అఖిల్ షెయోరాన్‌తో కూడిన భారత బృందం స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. 1731 పాయింట్లతో రెండో స్ధానంలో నిలిచిన ఈషా, దివ్య,పాలక్‌తో కూడిన భారత త్రయం సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్ రజత పతకాలు సొంతం చేసుకున్నారు. దీంతో షూటింగ్‌లోనే భారత్ ఖాతాలో 17 పతకాలు వచ్చి చేరాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
Asian Games 2023 Shooting : భారత షూటర్ల జోరు.. మరో రెండు గోల్డ్ మెడల్స్
Asian Games 2023 Shooting : ఆసియా క్రీడల్లో భారత షూటర్ల జోరు జోరు చూపిస్తున్నారు. తాజాగా రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ వివరాలు..
Published : Sep 29, 2023, 9:21 AM IST
|Updated : Sep 29, 2023, 10:04 AM IST
ఇకపోతే టెన్నిస్‌లో ఇప్పటి వరకు నిరాశాజనక ఫలితాలు నమోదవ్వగా... ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ డబుల్స్‌లో సిల్వర్ మెడల్ భారత్ సాధించింది. డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్ జోడీ రజత పతకం గెలుచుకుంది. రామ్‌కుమార్‌కు ఇది ఆసియన్ గేమ్స్‌లో తొలి పతకం కాగా.. సాకేత్‌కి ఇది మూడోది కావడం విశేషం.మొత్తంగా ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 30కు చేరింది. ప్రస్తుతం 8 గోల్డ్ మెడల్స్, 11 సిల్వర్ మెడల్స్, 11 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది.