Asian Games 2023 Medals list : ఆసియా క్రీడల్లో మన అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి వెన్నమ్ - ఓజాస్ డియోటాలే ద్వయం బంగారు పతకాన్ని ముద్దాడారు. హోరా హోరీగా జరిగిన ఫైనల్స్‌లో 159-158తో ఫైనల్‌లో కొరియన్ జట్టును ఓడించారు. ఆర్చరీలో భారత్‌కు ఇదే తొలి గోల్డ్ మెడల్ కావడం విశేషం. మరోవైపు 35 కిమీ రేస్‌వాక్ ఈవెంట్‌లో అథ్లెట్లు రామ్ బాబూ, మంజు రాణి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
2018 రికార్డు బ్రేక్ చేసిన భారత్ .. వంద పతకాల దిశగా జర్నీ ..
Asian Games 2023 Medals Record : తాజాగా వచ్చిన ఈ గోల్డ్ మెడల్‌తో భారత్ ఓ అరుదైన రికార్డును అందుకుంది.2018లో 70కు ఉన్న మెడల్స్ రికార్డు ఇప్పుడు 71కి చేరుకుంది.ఇక ఇప్పటి వరకు భారత్ ఖాతాలోకి 16 స్వర్ణం, 26 రజతం, 29 కాంస్య పతకాలు వచ్చాయి. వంద పతకాల లక్ష్యంగా దిగిన భారత అథ్లెట్లు త్వరలోనే ఆ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకెళ్తున్నారు.
ఇంకా ఈవెంట్స్ ఉన్న నేపథ్యంలో వంద కొట్టడం అంత కష్టం కాకపోవచ్చు. 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో లవ్లీనా ఇప్పటికే పతకాన్ని ఖాయం చేసుకుంది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బ్యాడ్మింటన్, క్రికెట్‌తో పాటు ఇతర ఈవెంట్లలోనూ భారత్‌కు పతకాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.