Asian Games 2023 India Gold Medal :ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. నేడు(సెప్టెంబర్ 25) 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ బృందం 1893.7 పాయింట్లను నమోదు చేసి ఈ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును వీరి బృందం అధిగమించింది. మొత్తంగా షూటింగ్‌లో ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు తాజా దానితో కలిపి మూడు మెడల్స్ వచ్చాయి.
వ్యక్తిగతంగానూ.. అలాగే 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో టీమ్‌గా గోల్డ్ మెడల్‌ను ముద్దాదడిన దివ్యాన్ష్, రుద్రాంక్ష్, తోమర్ వ్యక్తిగత విభాగంలోనూ ఫైనల్‌కు చేరుకోవడం మరో విశేషం. తుది పోరు కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి.. ఈ ఫైనల్‌కు అర్హత సాధించారు.