Asian Games 2023 :ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు భారత్ ఖాతాలోకి పతకాల వెల్లువ మొదలైంది. రోయింగ్, రైఫిల్ ఈవెంట్స్‌లో భారత ప్లేయర్లు సత్తా చాటారు. షూటింగ్‌లో మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్‌లో మెహులి ఘోష్, రమిత టీమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ ఫైనల్‌లో రోవర్లు అర్జున్ లాల్, అర్వింద్ కూడా రజత పతకాన్ని దక్కించుకున్నారు.
ఇక పురుషుల కాక్స్‌లెస్ పెయిర్ ఈవెంట్‌లో భారత రోయింగ్ జోడీ బాబూలాల్ యాదవ్, లేఖ్ రామ్ కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల కాక్స్డ్ ఎయిట్ ఈవెంట్‌లో భారత రోవర్స్ 05:43.01 టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచారు. మరోవైపు వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల ఈవెంట్‌లో భారత షూటర్ రమితా జిందాల్ కాంస్య పతకాన్ని అందుకున్నారు.
Asian Games 2023 Opening Ceremony : ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర దేశాల ప్రతినిధులతోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అథ్లెట్ల కవాతులో భారత క్రీడాకారుల బృందానికి.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో భారత ప్లేయర్లంతా.. ఖాకీ రంగు గల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత మహిళలు ఖాకీరంగు చీర, పురుషులు ఖాకీరంగు కుర్తాలో వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ దుస్తులను రూపొందించింది.