Asian Games 2023 India Medals :2023 ఆసియా గేమ్స్‌లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. 5000 మీటర్ల మహిళల రేస్‌లో భారత అథ్లెట్ పారుల్ చౌదరి స్వర్ణ పతకం దక్కించుకుంది. ఈ పోటీలో పారుల్.. తన లక్ష్యాన్ని15 నిమిషాల 14.75 సెకన్లలో చేరి అగ్రస్థానంలో నిలిచింది. ఇక సోమవారం కూడా పోటీల్లో పాల్గొన్నపారుల్.. 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో సిల్వర్ మెడల్ నెగ్గింది. మరోవైపు అన్నూ రాణి జావెలిన్ త్రోలో పసిడిని ముద్దాడింది. అన్నూ.. 62.92 మీటర్ల దూరం వరకు బల్లెం విసిరి ఫైనల్స్‌లో విజేతగా నిలిచింది. జావెలిన్ త్రో గేమ్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. ఇక మంగళవారం ఒక్కో రోజే భారత్‌కు రెండు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. దీంతో భారత్ ఖాతాలో ఇప్పటివరకు 15 స్వర్ణాలు సహా పతకాల సంఖ్య 69కు చేరింది. ఇందులో 15 స్వర్ణాలు, 26 రజతాలు, 28 కాంస్యాలు ఉన్నాయి.
మంగళవారం ఆయా విభాగాల్లో భారత అథ్లెట్లు గెలిచిన పతకాలు..
- పురుషుల 800 మీటర్ల పరుగులో మహ్మద్ అఫ్సల్.. రెండో స్థానంలో నిలిచి రజతం సాధించాడు.
- డెకథ్లాన్ విభాగంలో భారత అథ్లెట్ తేజస్విన్ శంకర్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
- ట్రిపుల్ జంప్ పురుషుల విభాగంలో ప్రవీణ్ చిత్రవేల్.. కాంస్య పతకాన్ని నెగ్గాడు.
- మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో.. విత్యా రామరాజ్ కాంస్యాన్ని సాధించింది.
- బాక్సింగ్ 54 కేజీల మహిళల విభాగంలో.. భారత బాక్సర్ ప్రీతీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
- 1000 మీటర్ల కనోయింగ్ మెన్స్ డబుల్స్‌లో భారత ద్వయం అర్జున్ సింగ్, సునీల్ సింగ్ మూడోస్థానలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
- పురుషుల విభాగం బాక్సింగ్ పోటీల్లో నరేందర్ కాంస్యం సొంతం చేసుకున్నాడు.