Asian Games 2023 India Gold Medal : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల జోరు కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు గోల్డ్ మెడల్స్ భారత్ ఖాతాలోకి వచ్చి చేరాయి. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్, షాట్‌ఫుట్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో భారత క్రీడాకారుడు అవినాశ్ సాబ్లే స్వర్ణం సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో 3000 స్టీపుల్‌చేజ్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయుడిగా అవినాశ్ సాబ్లే చరిత్ర లిఖించాడు. ఇక షాట్‌పుట్‌లో భారత 'బాహుబలి' తేజిందర్‌పాల్ సింగ్ తూర్ స్వర్ణాన్ని ముద్దాడాడు. అందరి కన్నా ఎక్కువగా 20.36 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. దీంతో భారత్ ఇప్పటివరకు సాధించిన మొత్తం గోల్డ్ మెడళ్ల సంఖ్య 13కు చేరింది.
Asian Games 2023 Nikhat Zareen :మరోవైపు ప్రముఖ భారత బాక్సర్ నిఖత్ జరీన్(తెలంగాణా అమ్మాయి) ఈ ఆసియా క్రీడల్లో నిరాశ ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రత్యర్థి రక్సత్తో తలపడిన జరీన్.. ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు పురుషుల 50 మీటర్ల ట్రాప్ ఈవెంట్‌లో భారత్ బ్రాండ్ మెడల్‌ను దక్కించుకుంది. దీంతో షూటింగ్ విభాగంలో ఈ సారి పతకాల సంఖ్య 22కి చేరింది.