తెలంగాణ

telangana

ETV Bharat / sports

Asian Games 2023 : రోయర్ల జోరు.. షూటర్ల హోరు.. తొలి రోజు భారత్​కు ఐదు పతకాలు - ఆసియన్ గేమ్స్ 2023 క్రికెట్​ ఫైనల్​కు

Asian Games 2023 First Day Five Medals : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో పతక వేటను మన అథ్లెట్లు ఘనంగా మొదలెట్టారు. మొదటి రోజు గోల్డ్ మెడల్​ దక్కకపోయినా.. ఏకంగా ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్నారు.

Asian Games 2023 : రోయర్ల జోరు.. షూటర్ల హోరు.. తొలి రోజు ఐదు పతకాలు
Asian Games 2023 : రోయర్ల జోరు.. షూటర్ల హోరు.. తొలి రోజు ఐదు పతకాలు

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:43 AM IST

Asian Games 2023 First Day Five Medals అదీ భారత్‌. ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పతక వేటను అథ్లెట్లు ఘనంగా ప్రారంభించారు. మొదటి రోజు గోల్డ్ మెడల్​ దక్కకపోయినా.. ఏకంగా ఐదు మెడల్స్​ను ఖాతాలో వేసుకున్నారు. షూటర్లు, రోయర్లు సూపర్ పెర్​ఫార్మెన్స్​తో అదరగొట్టి ఈ క్రీడల్లో దేశానికి మంచి శుభారంభాన్ని అందించారు. షూటర్‌ రమిత రెండు మెడల్స్​తో సత్తాచాటింది. మరోవైపు అమ్మాయిల క్రికెట్‌ జట్టు ఫైనల్స్​కు అర్హత సాధించింది. చెస్‌, బాక్సింగ్‌, హాకీలోనూ మంచి రిజల్ట్​ వచ్చాయి.

  • ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి మెడల్​ రోయింగ్‌లోనే వచ్చింది. ఆదివారం లైట్‌ వెయిట్‌ పురుషుల డబుల్‌ స్కల్స్‌ విభాగంలో అర్జున్‌ లాల్‌ - అర్వింద్‌ సింగ్‌ సిల్వర్​ మెడల్​తో భారత్‌ ఖాతా తెరిచారు. దీంతో ఫైనల్‌ ఎలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అర్జున్‌- అర్వింద్‌ ద్వయం 6 నిమిషాల 28.18 సెకన్లలో రేసును ముగించారు.
  • అనంతరం పురుషుల ఎయిట్‌ ఫైనల్‌ ఎలో భారత్​కు మరో సిల్వర్​ మెడల్​ ముద్దాడింది. నరేశ్‌, నీరజ్‌, చరణ్‌జీత్‌, నీతిష్‌, భీమ్‌, జస్విందర్‌, ఆశిష్‌, పునీత్‌, ధనంజయ్‌తో కూడిన భారత జట్టు 5:43.01సె టైమింగ్‌తో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
  • రోయింగ్​లోనే పురుషుల పెయిర్‌ ఫైనల్‌ ఎలో బాబులాల్‌ - రామ్‌ లేఖ్‌ జోడీ భారత్​కు కాంస్యాన్ని అందించింది. ఈ జంట 6:50.41సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
  • రోయర్లు అందించిన ఉత్సాహాన్ని షూటర్లు కూడా కొనసాగించారు. మహిళల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రమిత, మెహులి, ఆశి భారత్​కు సిల్వర్​ మెడల్​ అందించారు. క్వాలిఫికేషన్లో రమిత 631.9, మెహులి 630.8, ఆశి 623.3 స్కోరు చేశారు. దీంతో మొత్తం 1886 పాయింట్లతో భారత్‌ రెండో స్థానాన్ని అందుకుంది.
  • ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలోనూ రమిత మరో పతకాన్ని ముద్దాడింది. ఎనిమిది మంది షూటర్లు తలపడ్డ పైనల్​లో జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌ రమిత 230.1 పాయింట్లతో కంచు పతకాన్ని ముద్దాడింది.
  • అలా రోయింగ్​, షూటింగ్​లో కలిపి భారత్​కు తొలి రోజు మొత్తం ఐదు పతకాలు వచ్చాయి.

హాకీ.. ఇక ఈ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్​పై కన్నేసిన పురుషుల హాకీ జట్టు పతక వేటను ఘనంగానే ప్రారంభించింది. పూల్‌- ఎ మ్యాచ్‌లో భారత్​ 16-0 తేడాతో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్​ను మంగళవారం సింగపూర్​తో తలపడనుంది.

క్రికెట్​... ఈ ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్లో భారత్‌ పసిడికి అడుగు దూరంలో ఉంది. ఆదివారం సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుచేసి ఫైనల్​కు చేరింది. మరో సెమీస్​లో లంక 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్​ను ఓడించింది. దీంతో సోమవారం(సెప్టెంబర్ 25) భారత్‌.. శ్రీలంక మధ్య ఫైనల్‌ జరగనుంది.

చెస్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. తొలి రెండు రౌండ్లలో వీళ్లిద్దరూ విజయాలు అందుకున్నారు. ఇంకా పలువురు ఆటగాళ్లు కూడా మంచిగానే రాణించారు.

ప్రపంచ ఛాంపియన్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్‌లో 5-0తో రెండుసార్లు ఆసియా ఛాంపియన్‌ తి తామ్‌ గుయెన్‌ (వియత్నాం)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌ చేరింది.

ఇతర క్రీడలు.. ఫెన్సింగ్‌లో తనిక్షా ఖత్రి పతకానికి దూరమైంది. టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. గత ఆసియాకప్‌లో కాంస్యం గెలిచిన పురుషుల జట్టుతో పాటు మహిళల జ ట్టు నిరాశాజనక ప్రదర్శన చేశాయి. వాలీబాల్‌లోనూ భారత్‌ పతక రేసుకు దూరమైంది. మహిళల ఫుట్‌బాల్‌లో కూడా భారత్‌ నాకౌట్‌ చేరలేకపోయింది.

మరోసారి భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్.. ఈసారి కూడా వదిలేదేలే!

Asian Games 2023 : ఆసియా క్రీడల్లో పతకాల వేట షురూ.. భారత్​ ఖాతాలోకి మెడల్స్ వెల్లువ​

ABOUT THE AUTHOR

...view details