Asian Games 2023 Equestrian Gold Medal : ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్ గోల్డ్ మెడల్ సాధించింది. 41 ఏళ్ల తర్వాత మొదటి సారి ఈక్వస్ట్రియన్‌లో భారత్ గోల్డ్ మెడల్ అందుకోవడం విశేషం. హృదయ్ విపుల్, సుదీప్తి హజెలా, దివ్యకృతి సింగ్, అనూష్ గార్వాలాలతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచి ఈ పసిడి పతకాన్ని ముద్దాడింది. కాగా, ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌లో భారత్‌కు ఇది నాలుగో గోల్డ్ మెడల్. మిగిలిన మూడు పసిడి పతకాలు 1982 ఆసియా క్రీడల్లో వచ్చినవే.
Asian Games Sailing 2023 : సెయిలింగ్‌లో కొనసాగుతున్న పతకాల వేట.. మరోవైపు, సెయిలింగ్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. విష్ణు శరవణన్ సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో సెయిలింగ్ విభాగంలో భారత్‌కు ఇది మూడో మెడల్. ఇప్పటికే సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సెయిలింగ్‌లోనే మరో రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల విభాగంలో రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఎబాద్ అలీ ఆర్‌ఎస్ - X కేటగిరీలో, విష్ణు శరవణన్ ఐఎల్‌సీఏ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు.
ఇక భారత బాక్సర్ సచిన్ కూడా అదరగొట్టేశాడు. రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 57 కేజీల విభాగంలో ఇండోనేషియాకు చెందిన అస్రి ఉదిన్‌పై 5-0 ఆధిక్యంతో గెలుపొందాడు. ఇక 92 కేజీల విభాగంలో 16వ రౌండ్‌లో కర్గిస్థాన్ బాక్సర్ ఒముర్‌బెక్‌తో భారత బాక్సర్ నరేంద్రతో పోటీపడేందుకు రెడీ అవుతున్నాడు. మరోవైపు ఈస్పోర్ట్స్‌లో భారత ద్వయం అయాన్ బిస్వాస్, మయాంక్ అగర్వాల్.. స్ట్రీట్ ఫైటర్ నాకౌట్ రౌండ్ల నుంచి ఎలిమినేట్ అయ్యారు.